ఐరన్ రాడ్ స్లాబ్ కుప్పకూలి తండ్రీకొడుకులు దుర్మరణం : ఒకరి పరిస్థితి విషమం

الأحد، 22 مارس 2026

crime Father and Son Die Tragically After Iron Rod Slab Collapses hyderabad one in critical condition Srivatsa Apartments in Kundanbagh telangana

t f B! P L


హైదరాబాద్, కుందన్‌బాగ్‌లోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌ మూడవ అంతస్తులో బాల్కనీ పొడిగింపు పనులు జరుగుతుండగా ఐరన్ రాడ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మరణించగా, అపార్ట్‌మెంట్ యజమాని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుందన్‌బాగ్‌లోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులో నివసించే ద్వారక ప్రసాద్ ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేయడానికి తండ్రీకొడుకులైన దేవిదాస్, వివేక్ వచ్చారు. ఐరన్ రాడ్లతో నిర్మించిన బాల్కనీలో కూర్చుని యజమాని ద్వారక ప్రసాద్‌తో పనుల గురించి మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా ఆ ఐరన్ రాడ్ స్లాబ్ కుప్పకూలింది. బాల్కనీతో పాటు ముగ్గురూ మూడవ అంతస్తు నుంచి నేరుగా కింద పడిపోయారు. వివేక్ ఘటనా స్థలంలోనే మరణించగా, తండ్రి దేవిదాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యజమాని ద్వారక ప్రసాద్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ