సికింద్రాబాద్ స్టేషన్ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడ పనుల కారణంగా పలు ప్రధాన రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఫేజ్ -1 పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ప్రయాణీకులకు అనుమతి పైన రైల్వే శాఖ తాజాగా ముహూర్తం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని పర్యటన కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. సుమారు రూ.650 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరు ఒకటో అంతస్తులోకి ప్రవేశం, పైన వెయింటింగ్ హాళ్లు, దుకాణాలు వాటి కింద రైల్వే ప్లాట్‌ఫారాలతో ఆకట్టుకుంటోంది. బస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్‌లోకి రావడానికి, రైల్వేస్టేషన్ నుంచి నేరుగా వాటికి చేరుకునేందుకు స్కై వాక్‌లు ఏర్పాటు చేసారు. గతంలో చూసిన స్టేషన్ .. ఇప్పుడున్న రూపుతో పోల్చుకోలేని విధంగా ఆధునీకరించారు. అద్భుతంగా రూపు దిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ త్వరలోనూ తిరిగి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా తొలిదశలో భాగంగా ప్లాట్‌ఫామ్-10 వైపు చేపట్టిన వర్కులు పూర్తికావడంతో.. మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది.
చివరి దశకు చేరిన సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు
الاثنين، 23 مارس 2026
inaugurate various development projects and lay foundation stones indian railways Modi is scheduled to visit Telangana next month Secunderabad Station Redevelopment Works Reach Final Stage telangana
ليست هناك تعليقات:
إرسال تعليق