భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత, దేశీయ బులియన్ మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో చూశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ, భారతీయ బంగారు ధరలలో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా వీటి రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఉదయం ప్రారంభ సెషన్ లో 25,000 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 2,580 రూపాయల మేర తగ్గి 10 గ్రాములకు 1,70,500 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి దూసుకుపోతున్నా ఈ అనూహ్య పతనం చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం నాటి రేటుతో పోల్చుకుంటే ఒక గ్రాముకు సుమారు 258 రూపాయల మేర తగ్గుదల రికార్డయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 2,350 తగ్గి రూ. 1,56,300 వద్ద నిలిచింది. 18 క్యారెట్లు 10 గ్రాములకు 1,930 రూపాయలు తగ్గి 1,27,880 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
తగ్గిన బంగారం, వెండి ధరలు
Tuesday, March 3, 2026
bullion market Despite the escalation of international tensions Gold and silver prices fall national profit-taking was seen in Indian gold prices.
No comments:
Post a Comment