అంతర్జాతీయ మార్కెట్లో టెక్నో 'కామోన్' సిరీస్ లో అత్యంత టెక్నో కామోన్ 50 అల్ట్రా 5జీని అధికారికంగా విడుదల చేసింది. అధునాతన కెమెరా సెన్సార్లు, AI ఆధారిత ఫీచర్లు, అత్యంత ధృడమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షించేలా దీనిని తయారు చేశారు. 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం అత్యంత స్మూత్ గా ఉంటుంది. కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు 'ProXDR' ఐ-కేర్ టెక్నాలజీని అమర్చారు. స్క్రీన్ రక్షణ కోసం “గొరిల్లా గ్లాస్ విక్టస్ 2” గ్లాస్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అందించారు. 50MP Sony LYT-700C ప్రైమరీ సెన్సార్ OIS సపోర్ట్‌తో వస్తుంది. ఇంకా 50MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో పోర్ట్రెయిట్ ఫోటోల కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మంచి దృశ్యాలను క్యాప్చర్ చేయగలదు. ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. AI 60x సూపర్ జూమ్, గ్లేర్ రిమూవర్, షాడో రిమూవర్ వంటి స్మార్ట్ ఎడిటింగ్ ఫీచర్లు ఫోటో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి. మీడియాటెక్ డిమెంసిటీ 7400 అల్టిమెట్ (4nm) చిప్‌సెట్ ఈ ఫోన్ లో ఉపయోగిచారు. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ వంటి టాస్క్‌లను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై ఈ ఫోన్ నడుస్తుంది. కంపెనీ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6500mAh భారీ బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కువ సేపు వినియోగానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఈ మోడల్, త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
0 Comments