తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రూ. 25 వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన జిల్లా కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై లంచ్ తర్వాత తీర్పును వెల్లడించింది. గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను బీఆర్‌ఎస్ అగ్ర నాయకులు పరామర్శించి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందింది. అయితే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ అడ్డుకుని చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు బనాయించి జైలులో బంధించింది.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
Monday, March 2, 2026
000 Former MLA Balka Suman granted conditional bail surety of Rs. 25 telangana The verdict on the bail petition was announced after lunch.
No comments:
Post a Comment