రేపటి నుండి తిరుపతి నగరంవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రకటించాయి. తిరుపతి ఆర్థిక వ్యవస్థ అంతా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులపైనే ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్న టీ కొట్టు నుండి భారీ హోటళ్ల వరకు సుమారు 3,000కు పైగా తినుబండారాల కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ నెలకు సగటున 40 వేల కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో వేలాదిగా తరలివచ్చే భక్తులకు కనీసం అల్పాహారం, భోజనం అందించడం కూడా హోటల్ యజమానులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ నిండుకోవడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్త తెలియగానే తిరుపతిలోని 15కు పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకుల రద్దీ పెరిగింది. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడానికి తెల్లవారుజాము నుండే క్యూ కడుతున్నారు. ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
తిరుపతిలో రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్
الجمعة، 6 مارس 2026
Andhra Pradesh Commercial gas cylinder supply to be stopped in Tirupati from tomorrow rush of hotel owners and catering managers at more than 15 gas distributors
ليست هناك تعليقات:
إرسال تعليق