లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఉధృతం చేసింది.హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికిముందు బీరుట్‌తో పాటు లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో కూడా ఐడిఎఫ్ మెరుపు దాడులు చేపట్టింది. అక్కడి హిజ్బుల్లా ప్రధాన కమాండ్ సెంటర్‌ను వైమానిక దాడుల ద్వారా ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద ముఠాల ఆటకట్టించడమే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ దాడుల సమయంలో పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఐడిఎఫ్ గరిష్ట జాగ్రత్తలు తీసుకుంది. దాడులకు ముందే పౌరులను హెచ్చరించడం, లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మందుగుండు సామగ్రిని ఉపయోగించడం, నిరంతర వైమానిక నిఘా తదితర చర్యల ద్వారా పౌర హానిని తగ్గించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా వ్యూహాలను తిప్పికొట్టేలా ఈ దాడులు సాగాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
హిజ్బుల్లా స్థావరాలపై దాడులు ఉధృతం చేసిన ఇజ్రాయిల్
الأربعاء، 11 مارس 2026
international Israel intensifies attacks on Hezbollah bases Israeli forces destroyed Hezbollah's main command center there through airstrikes
ليست هناك تعليقات:
إرسال تعليق