షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ విడుదల : మార్చి 13 నుంచి ఫ్రీ ఆర్డర్స్ మొదలు

الأربعاء، 11 مارس 2026

Free Orders Start from March 13 Launch offers have also been announced on this smartphone science technology Xiaomi 17 Ultra Smartphone Launched

t f B! P L


దేశీయ మార్కెట్లో షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్లు విడుదల చేసింది. ఈ ఫోన్ ను 16 జీబీ + 51 2జీబీ సింగిల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర ను రూ. 1,39,999 గా నిర్ణయించింది. ఇది వైట్ అండ్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. మార్చి 13వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ పై లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ముందుగా ప్రీ బుక్ చేసి యూజర్లకు ఫోటోగ్రాఫర్ కిట్టు ఉచితంగా అందించబోతున్నట్లు షియోమీ ప్రకటించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. 6.9 అంగుళాల షియోమీ హైపర్ RGB OLED డిస్‌ప్లే తో అందించింది. ఇది M10 కస్టమ్ డిస్ప్లే , 12 బిట్ కలర్ డెప్త్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1 - 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 3nm చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. ఈ సూపర్ ప్రోసెసర్ ను మరింత వేగంగా చేసే 16GB LPDDR5X RAM మరియు 512GB (UFS 4.1) స్టోరేజ్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో 50MP Leica లైట్ ఫ్యూజన్ కెమెరా, 200MP Samsung HPE (3.2x - 4.3x ఆప్టికల్ జూమ్) కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం అందించింది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 30FPS వద్ద స్టేబుల్ 8K వీడియో రికార్డింగ్ మరియు 120FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డింగ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ 4K డాల్బీ విజయం వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120x డిజిటల్ జూమ్ మరియు గొప్ప ఇమేజ్ లను అందించే సత్తా కలిగి ఉంది. 6000mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 90W వైర్డ్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో షియోమీ Hyper AI సపోర్ట్ కూడా అందించింది. ఇవి కాకుండా ఫోన్ ను వేగంగా చల్లబరిచే 3D డ్యూయల్ ఛానల్ ఐస్ లూప్ కూలింగ్ సిస్టం కూడా జత చేసింది. ఈ ఫోన్ ప్రీమియం డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను Hi-Res ఆడియో మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ