ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై దర్యాప్తు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. అయితే ఈ కేసుసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. పుట్టా మహేశ్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా? తెలంగాణ పోలీసుల వాదనలో నిజమెంత? అసలు పుట్టా మహేష్ అక్కడకు ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రధానంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులతో పుట్టా మహేశ్ కు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు లోతైన విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు. ప్రధానంగా డ్రగ్స్ నెట్వర్క్ ఎంపీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టి చంద్రబాబుకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని తెలిసింది. డ్రగ్స్ కేసు ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. మరోవైపు ఈ కేసు అంశాలు ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఘటనలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు : రంగంలోకి దిగిన ఏపీ ఇంటలిజెన్స్
الثلاثاء، 17 مارس 2026
Andhra Pradesh AP Intelligence Steps In Chief Minister Chandrababu Moinabad Drugs Case TDP MP Putta Mahesh Yadav
ليست هناك تعليقات:
إرسال تعليق