Ad Code

మార్చి 2 నుంచిమహీంద్రా XEV 9e బుకింగ్స్ ప్రారంభం


హీంద్రా అండ్ మహీంద్రా XEV 9e స్పెషల్ ఎడిషన్ విడుదల చేసింది. కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి. దీని ధర 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్). సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu