డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ

الثلاثاء، 24 فبراير 2026

Be vigilant against digital frauds expressed concern that these are unforgivable national Prime Minister Narendra Modi in Mann Ki Baat

t f B! P L


ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ మోసాలపైన ప్రజలను అప్రమత్తం చేశారు.  డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలపై సమాజంలో ఇప్పటికే చాలా అవగాహన వచ్చింది. అయితే ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతున్నాయన్నారు. ఇవి క్షమించరానివని, డిజిటల్ అరెస్టుకు, ఆర్థిక మోసానికి అమాయకులు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా, అవగాహనతో ఉండటం చాలా ముఖ్యమన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కేవైసీ- నో యువర్ కస్టమర్ పట్ల అప్రమత్తత అత్యంత ముఖ్యమైన అంశమని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. ఈ ప్రక్రియ అందరికీ తెలిసినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాన్నారు. బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు ఎప్పటికప్పుడు తిరిగి- కేవైసీ నిర్వహిస్తాయన్నారు. ఇదే అవకాశంగా నేరస్థులు నకిలీ కాల్స్ చేస్తారని, ఎస్ ఎం ఎస్, లింకులను పంపుతారని, అలాంటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మీకు వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని, అనుమానం ఉంటే నేరుగా బ్యాంకుకే వెళ్లి నిర్ధారించుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందేశాన్ని గమనించి,. కేవైసీని నవీకరించుకోవాలన్నారు. కేవలం బ్యాంక్ యాప్స్ లేదా బ్రాంచ్‌ల ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఒకే పాస్ వర్డ్ చాలా కాలం పాటు ఉంచకుండా పాస్‌వర్డ్‌లు తరచూ మారుస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలలో అప్రమత్తతే అన్నిటి కన్నా ముఖ్యమని, కనుక ప్రజలు డిజిటల్ మోసాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్రమత్తంగా లేకుంటే మీ కష్టార్జితం సైబర్ నేరగాళ్ళ పాలు అయ్యే ప్రమాదం ఉంటుందని ప్రధాని మోడీ హెచ్చరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ