కర్ణాటకలో గత సంవత్సరం మార్చి 6న ఇజ్రాయిల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమ కాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు. అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు.
0 Comments