కేంద్ర బడ్జెట్2026-27పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొత్త బడ్జెట్ పౌరుల జీవనశైలిని మారుస్తూ రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నూతన దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచి, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం స్థిరమైన దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఏఐ సహా లేటెస్ట్ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ రిఫార్మ్స్, రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ విధానాలకు ఈ బడ్జెట్ ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కేంద్రం 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం, రాష్ట్రం తరఫున మరో 20 శాతం అందిస్తుండటంతో ఈ రంగానికి భరోసా లభిస్తుందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది 2047 నాటికి భారతదేశాన్ని 'వికసిత్ భారత్'గా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఉందని కొనియాడారు.
కేంద్ర బడ్జెట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నూతన దోహదం చేస్తుంది !
الأحد، 1 فبراير 2026
Andhra Pradesh CM Chandrababu Naidu keeping in mind the goals of Viksit Bharat by 2047 Union Budget will provide a new impetus to the Ease of Doing Business policy
ليست هناك تعليقات:
إرسال تعليق