దేశీయ మార్కెట్లో బోట్ క్రోమ్ ఐరిస్ అధునాతన స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఇది 466×466 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన 1.32-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. ఆల్వేస్ ఆన్ ఫీచర్ ను కలిగి ఉంది. 1000 నిట్ బైట్ నెస్ ను దీనికి అందించారు. దీనిలో హెల్త్ కు సంబంధించిన కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. హృదయస్పందన రేటు, SpO2 ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, గైడెడ్ బ్రీతింగ్ మోడ్స్, వాకింగ్ – క్యాలరీ బర్నింగ్ సెన్సార్, ఆడవారి కోసం బుుతు చక్రం ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు టెన్నిస్, క్రికెట్, వాలిబాల్, రన్నింగ్ వంటి స్పోర్ట్స్ ఫీచర్లకు ఈ యాప్ మద్దతు ఇస్తోంది. ఆకర్షణీయమైన ఫేస్ వాచ్ లు, నావిగేషన్ కోసం 2.5D యూజర్ ఇంటర్ ఫేస్ ఉంది. వీటితో పాటు ఫోన్ కెమెరా కంట్రోల్, ఆడియో ప్లేయర్, కాలిక్యులేటర్, గేమ్స్, వాతావరణ సూచనలు, స్టాప్ వాచ్, అలారం, టైమర్ వంటి స్మార్ట్ టూల్స్ ఈ వాచ్ లో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లో 180mAh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 5 రోజుల పాటు నిరంతరాయంగా వాచ్ పనిచేస్తుందని బోట్ వర్గాలు తెలిపాయి. ఈ వాచ్ 0-100% చార్జింగ్ కావడానికి 2 గంటల సమయం తీసుకోనుంది. అటు దుమ్ము, దూళి, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ ను ఈ వాచ్ కు అందించారు.
ホーム
/
technology
/
బోట్ క్రోమ్ ఐరిస్ స్మార్ట్ వాచ్ విడుదల
الاثنين، 9 فبراير 2026
1.32-inch AMOLED display with a 466x466 pixel resolution BoAt Chrome Iris Smartwatch Launched sleep tracking SpO2 tracking technology
ليست هناك تعليقات:
إرسال تعليق