Ad Code

అమెరికాతో వాణిజ్య ఒప్పందం : తొలి దశపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం


భారత్-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తొలి దశపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఇరుదేశాల సంయుక్త ప్రకటన 45 రోజుల్లోనే వస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ సంతకాలు జరిగిన ఒకట్రెండు రోజుల్లోనే అమెరికా జారీ చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మన ఉత్పత్తులపై 18 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం భారత్ పై అమెరికా 50 శాతం సుంకం వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య లీగల్ ఒప్పందం జరిగిన తర్వాత భారత్ పై టారిఫ్ తగ్గింపు అమల్లోకి వస్తాయని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం అధికారిక ఒప్పంద ముసాయిదా పనులు జరుగుతున్నట్లు పియూశ్ గోయల్ తెలిపారు. దీనికోసం నెలకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై మార్చిలోనే సంతకాలు జరగొచ్చని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలో ఎలాంటి పెట్టుబడుల అంశాలు లేవన్నారు. లీగల్ ఒప్పందం తర్వాత ఈ ఉత్పత్తులపై సుంకాల్లో మరిన్ని తగ్గింపులు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. భారత్లో విమానాలకు గిరాకీ ఎక్కువగా ఉందని.. బోయింగ్ సంస్థకు ఇప్పటికే మన కంపెనీలు ఆర్డర్లు ఇచ్చాయని పేర్కొన్నారు. ఇంకా 70 నుంచి 80 బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఇక ఇంజిన్లు, ఇతర విడిభాగాలు కలిపితే 100 బిలియన్ డాలర్ల విమాన కొనగోళ్లు ఉంటాయని అంచనా వేశారు.

Post a Comment

0 Comments

Close Menu