రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గించి అమెరికా, వెనెజువెలా నుంచి భారత్ కొంటుందని వాణిజ్య ఒప్పందం తర్వాత ట్రంప్ ప్రకటించారు. దీనిపై భారత్ అధికారికంగా స్పందించకపోయినా, గణాంకాలు మార్పును నిర్ధారిస్తున్నాయి. పుతిన్ దీన్ని భారత నిర్ణయంగా గుర్తించారు. 2025 డిసెంబర్‌లో రష్యా నుంచి 2.7 బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ దిగుమతి చేసుకుంది. నవంబర్‌లోని 3.8 బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ కొనుగోలు చేసింది. అంటే నెల రోజుల్లో ఆయిల్ దిగుమతి 27% తగ్గించింది. మొత్తం భారత ఆయిల్ దిగుమతిలో రష్యా వాటా 34% నుంచి 24.9%కి పడిపోయింది. 2024 డిసెంబర్‌తో పోల్చితే 15% కొనుగోలు తగ్గింది. 38 నెలలుగా రష్యా నుంచి జరుగుతున్న కొనుగోలులు ఇదే తక్కువ. అమెరికా నుంచి 2025 డిసెంబర్ దిగుమతులు 2024తో పోలిస్తే 31% పెరిగాయి. రష్యా నుంచి 15 శాతం తగ్గితే.. అమెరికా నుంచి దిగుమతి రెట్టింపైంది. వెనెజువెలా కూడా ప్రధానంగా చేరుతోంది. ఇది ట్రంప్ వాగ్దానాలకు సమానంగా ఉంది, కానీ ఆర్థిక లాభాలు ప్రశ్నార్థకం. రష్యా ఆయిల్ రవాణా ఖర్చు అమెరికా ఆయిల్ షిప్పింగ్ చార్జీలతో పోలిస్తే సగం ఉంటుంది. రష్యా నుంచి మనం రూపాయిల్లో కొనుగోలు (పెట్రో-రూపీ ఇన్వెస్ట్‌మెంట్) చేశాం. ఆ రూపాయలను కూడా రష్యా భారత్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. అమెరికా నుంచి డాలర్లలోనే లావాదేవీలు జరుపుతున్నాం. ఇక అమెరికా నుంచి రవాణాకు భారత్ బ్యారెల్‌కు 4 నుంచి 5 డాలర్లు అదనంగా చెల్లించాలి. వెనెజువెలా ఆయిల్ కొటే బ్యారెల్‌కు 10 డాలర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రష్యా ఆయిల్ తక్కువగా వస్తున్నా.. అమెరికా ఒత్తిడి కారణంగానే మోదీ రష్యా ఆయిల్ తగ్గించి అమెరికా ఆయిల్ పెంచినట్లు చర్చ జరుగుతోంది.
ホーム
/
Trump announced that India would reduce its oil purchases from Russia and instead buy from the US and Venezuela
/
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గించిన భారత్ !
الاثنين، 9 فبراير 2026
After a trade agreement India reduces oil purchases from Russia international Trump announced that India would reduce its oil purchases from Russia and instead buy from the US and Venezuela
ليست هناك تعليقات:
إرسال تعليق