పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నల్ల దుస్తులు ధరించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. 'సర్' బాధితులు, టీఎంసీ బృందంతో కలిసి ఈసీతో భేటీ అయిన ఆమె, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు నిరసనగా నల్ల దుస్తులు ధరించారు. ఇదే అంశంపై ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రంలో అమలవుతున్న SIRను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో భారత ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ సీఈఓలను ప్రతివాదులుగా చేర్చారు. జనవరి 28న పిటిషన్ దాఖలైంది.ఎన్నికల కమిషన్ తెలిపిన ప్రకారం.. రెండో దశ SIR కార్యక్రమం దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇవి అండమాన్-నికోబార్ ద్వీపాలు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పెద్ద ఓటర్ల సంఖ్య కలిగి ఉండటంతో, సవరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈసీఐ నిర్ణయించింది. ఈ సవరణ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు ముద్రణ మరియు శిక్షణ దశ ఉంటుంది. అనంతరం నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు ఇంటింటికీ గణన దశ చేపడతారు. ఆ తర్వాత, డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ホーム
/
west bengal
/
నల్ల దుస్తులు ధరించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన సీఎం మమతా బెనర్జీ
الاثنين، 2 فبراير 2026
along with 'SIR' victims and a TMC team CM Mamata Banerjee met the Chief Election Commissioner wearing black clothes national west bengal
ليست هناك تعليقات:
إرسال تعليق