హైదరాబాద్ లోని దుండిగల్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను దుండగలు దారుణంగా హత్య చేసి అనంతరం అక్కడ నుండి పారిపోయారు. సోఫాలో సుశీలమ్మ మృతదేహం కనిపించగా వెంటనే కుటంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో కీలక ఆధారాలు సేకరించారు. అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండటంతో ఇది దొంగల పనా లేదంటే తెలిసినవారే డబ్బు, నగల కోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇద్దరు అనుమానితులను సైతం పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య జరిగిన ప్రాంతంలో సంచరిస్తూ కనిపించారు. వారిలో ఒక యువకుడితో పాటు మర వ్యక్తి ఉన్నారు. ఇద్దరూ కంగారుపడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంతే కాకుండా ఇద్దరూ నడుచుకుంటూనే అక్కడ నుండి వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య
الثلاثاء، 3 فبراير 2026
CCTV footage shows two unidentified individuals loitering in the area crime telangana Woman brutally murdered in Hyderabad
ليست هناك تعليقات:
إرسال تعليق