పనితీరు ఆధారిత బోనస్‌ను ప్రకటించిన ఇన్ఫోసిస్

السبت، 14 فبراير 2026

85 percent for employees for the third quarter business Infosys announces performance-based bonus it national science technology

t f B! P L


2025-26 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి ఉద్యోగులకు చెల్లించే పనితీరు ఆధారిత బోనస్‌ను సగటుగా 85 శాతంగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇది ఇటీవల త్రైమాసికాలతో పోలిస్తే అత్యధిక బోనస్‌గా నిలవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఈ బోనస్ మొత్తం ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతంతో పాటు చెల్లించనున్నట్లు సంస్థ అంతర్గత సమాచారంలో పేర్కొంది. ఇటీవల కాలంలో ఐటీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్ఫోసిస్ మాత్రం వ్యాపార పరంగా స్థిరమైన ప్రదర్శన చూపింది. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు దక్కించుకోవడం, ప్రాజెక్టుల అమలు మెరుగ్గా సాగడం వంటివి ఈ బోనస్ పెంపుకు ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బోనస్ శాతం పెరగడం వల్ల ఉద్యోగుల మనోధైర్యం గణనీయంగా పెరిగిందని.. మార్కెట్‌లో టెక్నాలజీ షేర్లపై ఒత్తిడి ఉన్నా ఉద్యోగుల్లో మాత్రం సానుకూల భావన కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ త్రైమాసికంలో ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్ శాతాలు మారాయి. కొంతమంది ఉద్యోగులు 75 శాతం నుంచి 100 శాతం వరకు బోనస్ పొందినట్లు తెలిపారు. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఎక్కువ బోనస్ దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన కొందరికి పూర్తిస్థాయి. అంటే 100 శాతం బోనస్ లభించడం విశేషం. గత కొన్ని త్రైమాసికాల్లో ఇంత అధిక స్థాయిలో బోనస్ ఇవ్వడం అరుదైన విషయమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్ లో సుమారు 3.2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బోనస్ నిర్ణయం ఇటీవల విడుదలైన ఉద్యోగుల పనితీరు రేటింగ్స్ తర్వాత రావడం గమనించదగ్గ అంశం. గత సంవత్సరం కూడా పనితీరు ఆధారంగా సంస్థ 5 శాతం నుంచి 8 శాతం వరకు జీత పెంపు ఇచ్చిన సంగతి ఉద్యోగుల్లో ఆశలు పెంచుతోంది. ఈసారి బోనస్ పెరగడానికి ప్రధాన కారణం కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండటమే. ఆదాయ వృద్ధి అంచనాల్లో స్థిరత్వం, లాభాల్లో మెరుగుదల, అలాగే కీలక మార్కెట్ల నుంచి వచ్చిన ఆర్డర్లు సంస్థకు బలాన్నిచ్చాయి. జనవరిలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ మేనేజ్‌మెంట్ కూడా భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇచ్చిన అధిక బోనస్ సంస్థ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. బోనస్ పెరగడంతో పాటు, ఇప్పుడు ఉద్యోగులు తదుపరి దశగా జీతం పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. కంపెనీ మానవ వనరుల విభాగం గతంలో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశాల్లో కూడా వేరియబుల్ పే మెరుగ్గా ఉంటుందన్న సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల వాతావరణం ప్రస్తుతం సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. గత త్రైమాసికంలో సగటుగా 75 శాతం బోనస్ ఇచ్చింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ