జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఒక ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. ఏనుగులు పలువురిపై దాడి చేస్తున్నాయి. గురువారం రాత్రి చుర్చు బ్లాక్‌లోని గోండ్వార్ గ్రామంలోకి ఆ ఏనుగులు ప్రవేశించాయి. శుక్రవారం తెల్లవారుజామున ఒక పూరింటిపై దాడి చేశాయి. ఆ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరిని తొక్కి చంపాయి. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఏనుగుల మంద గత కొన్ని రోజులుగా బొకారో, రామ్‌గఢ్, హజారీబాగ్ జిల్లాల్లో తిరుగుతున్నదని హజారీబాగ్ తూర్పు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) వికాస్ కుమార్ ఉజ్వాల్ తెలిపారు. దీనికి ముందు బొకారో జిల్లాలో కూడా ప్రాణ నష్టం కలిగించాయని చెప్పారు. ఏనుగుల మందను అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఏనుగుల మంద దాడిలో ఆరుగురు దుర్మరణం
الجمعة، 13 فبراير 2026
Hazaribagh district Jharkhand national Six killed in elephant attack They trampled to death four members of a family sleeping in the house and two others
ليست هناك تعليقات:
إرسال تعليق