ఆడి హైదరాబాద్ సెంట్రల్ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇది తమకు రెండో షోరూమ్ అని, జాతీయ సగటుకన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8-10% స్థాయిలో మార్కెట్ వాటా ఉంటోందన్నారు. వచ్చే నెలలో కొత్త స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు. నగరంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సర్వీసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు డీలర్ ప్రిన్సిపల్ వికాస్ చౌదరి, వీవీసీ గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్ర ప్రసాద్ చౌదరి తెలిపారు.
ホーム
/
technology
/
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కారు విడుదల
السبت، 7 فبراير 2026
Audi India Brand Director Balbir Singh Dhillon Audi to launch new sports car next month automobile possibility of increasing car prices again in light of the rupee's depreciation technology
ليست هناك تعليقات:
إرسال تعليق