ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పై విమర్శలకు దిగిన మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడికి దిగి టీడీపీ అనుచరులు నిప్పంటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు చిప్ దొబ్బిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీకి మంటపుట్టించాయి. దీంతో ఇవాళ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిని వందలాది మంది టీడీపీ అనుచరులు ధ్వంసం చేసి నిప్పంటించారు. ఇంటి ఆవరణతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో జోగి రమేశ్ కర్నూల్ లో ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నా పరిస్ధితిని అదుపు చేయడంలో విఫలమయ్యారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ అనుచరులు
الأحد، 1 فبراير 2026
Andhra Pradesh harsh remarks targeting Minister Nara Lokesh hundreds of TDP followers vandalized TDP followers set fire to former minister Jogi Ramesh's house
ليست هناك تعليقات:
إرسال تعليق