తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించిన ఆయన, బీజేపీ , బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘చీకటి ఒప్పందాలు’ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ-ఫామ్‌లను బీఆర్ఎస్ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ తన స్వార్థం కోసం అటకెక్కించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీల గోదావరి జలాలను అందిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవేనని, కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల జిల్లా రైతాంగం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే ‘కూలేశ్వరం’గా మారిందని, ఆ ప్రాజెక్టు నిధులతో ఆయన కుటుంబ సభ్యులు ఫామ్ హౌసులు కట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. తాండూరు, పరిగి , వికారాబాద్ ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. మక్తల్, నారాయణపేట , కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలను తరలించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టానికి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిలే బాధ్యులని విమర్శించిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం కోర్టు కేసులను పరిష్కరించి ఆ రోడ్డు పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్డు , రేడియల్ రోడ్లు రాబోతున్నాయని, వికారాబాద్ త్వరలోనే ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చరిత్రను తాను చెరిపేయాలని చూస్తున్నానని కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర, దొంగ నోట్ల వ్యవహారం , దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర తెలంగాణ ఉన్నంత కాలం చెరిగిపోదని, ఆ ‘పాపాల భైరవుడి’ చరిత్ర ప్రజలకు గుర్తుండేలా చేసే బాధ్యత తనదని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విషం చిమ్మే పాములకు మళ్ళీ పాలు పోయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా వికారాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
السبت، 7 فبراير 2026
'Praja Palana-Pragati Bata' public meeting held in Narayanpur Chief Minister Revanth Reddy telangana Vikarabad to become a world-class tourist destination
ليست هناك تعليقات:
إرسال تعليق