విపక్ష సభ్యుల ఆందోళనలతో వాయిదా పడిన లోక్‌సభ

الأربعاء، 4 فبراير 2026

Lok Sabha adjourned amidst protests by opposition members Modi was scheduled to address the Lok Sabha today on the motion of thanks on the budget national

t f B! P L


లోక్‌సభ విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడింది. బడ్జెట్‌పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ నేడు లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభ బుధవారంనాడు మూడు సార్లు వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభ కాగానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్‌సభ వాయిదా పడింది. దీంతో విపక్ష సభ్యులు పార్లమెంటు మెట్ల వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలో సమాధానం ఇస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గెయల్ చెప్పడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా.. 8 మంది ఎంపీలను సమావేశాల నుంచి బహిష్కరించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు వ్యతిరేకంగా విపక్ష సభ్యలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో మోడీ ప్రసంగానికి ముందే లోక్‌సభను స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ