తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా 166 మున్సిపాలిటీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్‍లకు రేపు పోలింగ్ జరుగనున్నది. దానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ రోజున ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‍ల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. అలాగే రేపు జరిగే పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి అంతా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి జిల్లాల్లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదంయ 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.
మున్సిపల్ ఎన్నికలు : స్కూళ్లకు ప్రభుత్వం సెలవు
الثلاثاء، 10 فبراير 2026
Election Commission has instructed the district collectors Government Holiday for Schools Municipal Elections officials have made the necessary arrangements for it telangana
ليست هناك تعليقات:
إرسال تعليق