Ad Code

భూమికి చేరువగా పెద్ద ఆస్టరాయిడ్ : నాసా హెచ్చరిక


భూమికి చేరువగా పెద్ద ఆస్టరాయిడ్ వస్తుందని నాసా హెచ్చరించింది. దీని వెడల్పు 410 అడుగులు. NASA JPL దాని పరిమాణాన్ని ఒక పెద్ద భవనంతో పోల్చింది. ఈ ఆస్టరాయిడ్‌ను 2025లో గుర్తించారు. ఇది ఫిబ్రవరి 21న భూమికి దగ్గరగా వస్తుందనీ, ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, భూమికి , ఆస్టరాయిడ్ మధ్య దూరం 5.89 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నాసా చెప్పింది. భూమికి చేరువగా వస్తున్న ఆస్టరాయిడ్ 2025 YU15 ను శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి కొంత సమీపం నుండే వెళ్తున్నప్పటికీ, దీని దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, వీటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల వీటి కక్ష్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు వీటి పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఆస్టరాయిడ్ 2025 YU15 'అటెన్'  సమూహానికి చెందినది. ఈ తరహా గ్రహశకలాలు భూమి కక్ష్యను దాటుతుంటాయి. ఇది గంటకు 21,306 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, ఇది 36,60,000 మైళ్ల దూరంలో ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ దూరం తక్కువే అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదకరమైన వస్తువులను గుర్తించడానికి నాసా కొన్ని కఠినమైన నిబంధనలను పాటిస్తుంది. ఏదైనా గ్రహశకలం భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల లోపు ఉండి, 85 మీటర్లకుమించి వెడల్పు ఉంటేనే దానిని ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అందువల్ల, ఆస్టరాయిడ్ 2025 YU15 ప్రయాణం సురక్షితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారతదేశం కూడా గ్రహశకలాల పరిశోధనలో తన పట్టును పెంచుకుంటోంది. ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భారీ గ్రహశకలాలను దగ్గరగా అధ్యయనం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ముఖ్యంగా 2029లో భూమికి దగ్గరగా రానున్న 'అపోఫిస్'  గ్రహశకలంపై పరిశోధనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నాసా,ఈఎస్ఏ, జాక్సా వంటి సంస్థలతో భారత్ సహకరించనుంది. భవిష్యత్తులో గ్రహశకలాలపై ల్యాండింగ్ చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రకారం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా శక్తివంతమైనది, అది సెకనుకు 9.8 మీటర్ల వేగంతో ఒక వస్తువును లాగగలదు. కొన్నిసార్లు, ఉల్కలు కూడా భూమి వైపుకు లాగబడతాయి. గ్రహశకలాలు ,ఉల్కలు రెండూ భూమిపై పడితే హానికరం కావచ్చు.

Post a Comment

0 Comments

Close Menu