ఆంధ్రప్రదేశ్ లో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరగనుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా లెక్కల సేకరణ నేపధ్యాన్ని వివరిస్తూ 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యానంతరం నిర్వహించే 8వ జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ ప్రత్యేకతల గురించి వివరిస్తూ పోర్టల్స్, యాప్స్ ద్వారా నిర్వహించే డిజిటల్ సెన్సస్ అని డిజిటల్ సెన్సస్ అనగా డేటా సేకరణ, నిర్వహణ, మానిటరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే సెల్ఫ్ ఎన్యుమరేషన్, కుల గణన, జియో రిఫరెన్సు మ్యాపులు, కృత్రిమ మేధను ఉపయోగించి వేగవంతంగా డేటా డెస్సిమినేషన్ వంటి చర్యలు తీసుకుంటారని వివరించారు. డిజిటల్ సెన్సస్ కు సంబంధించి మొబైల్ యాప్స్, వెబ్ పోర్టళ్ళను 16 ప్రాంతీయ భాషల్లో రూపొందించండం జరుగుతోందని వివరించారు. అనంతరం జనాభా లెక్కల సేకరణ-2027 టైం లైన్ గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈనెలలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశం, ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాల మధ్య మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డు ట్రైనర్లు, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈఏడాది ఎప్రిల్ నుంచి సెప్టెంబరు మాసాల మధ్య హౌస్ లిస్టింగ్ కు సంబంధించిన ఫీల్డు వర్కు నిర్వహించ బడుతుందని దానికి 15 రోజుల ముందు సెల్ప్ ఎన్యుమరేషన్ కు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ చెప్పారు. “నవంబరు-డిశంబరు మాసాల్లో జనాభా లెక్కల సేకరణకు అవసరమైన మెటీరియల్ ప్రచురణ జిల్లాలకు పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబరు నెలలో సెన్సస్ అధికారులకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని వివరించారు. అదే విధంగా డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి మాసాల మధ్య మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డు టైనర్లు, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్ల నియమాక ప్రక్రియ జరుగుతుందన్నారు. డిసెంబరులో స్పెషల్ చార్జి అధికారుల నియామకం వారికి శిక్షణా కార్యక్రమం ఉంటుందని వివరించారు. అనంతరం రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన శాఖలు ఏర్పాట్లు చేయాలి.” అని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా లెక్కల సేకరణ : రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్
الخميس، 5 فبراير 2026
Andhra Pradesh Population Census to be conducted from February 9 to 28 next year process will take place in two phases State Census Director J. Nivas
ليست هناك تعليقات:
إرسال تعليق