తమిళనాడులోని కోయంబత్తూరులో సిట్రోయెన్ కంపెనీకి చెందిన ప్రీమియం ఫ్లాగ్ షిప్ మోడల్ సీ5 ఎయిర్‌క్రాస్ కొనుగోలు చేసిన వారికి అదే కంపెనీకి చెందిన సిట్రోయెన్ C3 X అనే మరో కారును పూర్తిగా ఉచితంగా ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 37.4 లక్షలు కాగా, ఉచితంగా ఇచ్చే C3 X కారు విలువ సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఈ భారీ ఆఫర్ వార్త తెలియగానే కొత్త కారు కొనాలనుకునే వారు కోయంబత్తూరులోని షోరూమ్ వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ ఆఫర్‌లో ప్రధానమైన కారు C5 ఎయిర్‌క్రాస్. ఇది మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో 2.0-లీటర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 177 hp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ 'ఫ్లయింగ్ కార్పెట్ రైడ్'. దీని ప్రత్యేక హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్ రోడ్డుపై ఉండే గుంతలను లోపల ఉన్న ప్రయాణికులకు తెలియనివ్వదు. పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల డిజిటల్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి అత్యున్నత భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 2025 ఆగస్టులో లాంచ్ అయిన సిట్రోయెన్ C3 X ఒక కాంపాక్ట్ క్రాస్ ఓవర్ మోడల్. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. లీటరుకు సుమారు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఉచితంగా ఇస్తున్నప్పటికీ ఇందులో ఫీచర్ల విషయంలో డీలర్ ఎక్కడా తగ్గలేదు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఒకే ఇంట్లో రెండు కార్లు కావాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. సాధారణంగా కార్ల కంపెనీలు ఇంత పెద్ద ఆఫర్లు ఇవ్వవు. అయితే సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ మోడల్ అమ్మకాలు గత కొంతకాలంగా మందగించాయని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. షోరూమ్‌లో పేరుకుపోయిన పాత స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయడంతో పాటు, సిట్రోయెన్ బ్రాండ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డీలర్ ఈ క్రియేటివ్ ఐడియాను ఎంచుకున్నారు. 37 లక్షల కారుపై నగదు తగ్గింపు ఇచ్చే బదులు, ఏకంగా మరో కారునే బహుమతిగా ఇవ్వడం వల్ల కస్టమర్లు భారీగా ఆకర్షితులవుతారని డీలర్ అంచనా వేస్తున్నారు.
ホーム
/
technology
/
సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ కొనుగోలు చేస్తే సిట్రోయెన్ C3 X కారు ఉచితం !
Thursday, February 19, 2026
automobile Buy Citroen C5 Aircross and get a free Citroen C3 X Coimbatore science social media platform has announced Tamil Nadu technology
No comments:
Post a Comment