పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ దంపతులకు తోషఖానా 2 అవినీతి కేసులో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షవిధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అధికారంలో ఉన్నపుడు సౌదీ ప్రభుత్వం నుంచి అందిన ఖరీదైన బహుమతులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు నిరూపితమవ్వవడంతో ఈ కేసులో ఖాన్ దంపతులకు జైలుశిక్ష పడింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుక్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు 10 యేళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ.1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ దంపతుల వయసు, ఆరోగ్యం ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించినట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, గత 2022 ఏప్రిల్‌లో అధికారం కోల్పోయిన 73 యేళ్ల ఇమ్రాన్ ఖాన్... డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటూ గత 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉంటున్న విషయం తెల్సిదే. ఈ తాజా తీర్పుతో ఆయనపై ఉన్న కేసుల సంక్య, శిక్షల కాలం మరింత పెరిగింది. 

Post a Comment

Previous Post Next Post