రాజస్తాన్ లోని కోట్ పుట్లీ -బెర్హుర్ జిల్లా కర్కడి గ్రామానికి చెందిన రైతు శ్రవణ్ గుర్జర్ మేకల మేత కోసం చెట్టు కొమ్మలను నరుకుతుండగా, సమీపంలోని పొదల్లో దాగి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. ఈ ఆకస్మిక దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చిరుత తన గోళ్లతో రక్కుతూ, పళ్లతో కరుస్తున్నా సరే, శ్రవణ్ ప్రాణభయంతో పోరాడారు. తన చేతిలో ఉన్న గొడ్డలితో చిరుత తలపై బలంగా కొట్టారు. ఈ దాడిలో చిరుతపులి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌ను వెంటనే అల్వార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చిరుతపులి మృతదేహాన్ని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారి మనోజ్ నాగా తెలిపారు.
0 Comments