అమెరికాలో ఎన్నారై ఘాతుకం : నలుగురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన దుండగుడు

السبت، 24 يناير 2026

Gunman shoots and kills four family members hree children managed to escape from their father international national NRI commits heinous crime in America

t f B! P L


మెరికాలోని జార్జియా స్టేట్‌లోని గ్వినెట్‌ కౌంటీలో భార్యతో గొడవ పడిన ఓ ఎన్నారై విచక్షణ కోల్పోయి ఆమె కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి తప్పించుకున్న ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్కుని తమ ప్రాణాలు రక్షించుకోగలిగారు. భారత మూలాలున్న విజయ్‌ కుమార్ (51), మీము డోగ్రా భార్యాభర్తలు. వీళ్లకు ఓ కొడుకు (12) ఉన్నాడు. ఈ కుటుంబం నివాసముంటోంది అట్లాంటాలో. అయితే ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొడుకును తీసుకుని గ్వినెట్‌ కౌంటీలోని బ్రూక్‌ ఐవీ కోర్ట్‌లో ఉన్న భార్య తరఫు బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీయదు.. కాసేపటికి 112 ఎమర్జెన్సీ నెంబర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. విజయ్‌ కొడుకే పోలీసులకు కాల్‌ చేసింది. మరో ఇద్దరు పిల్లలతో కలిసి అల్మారాలో దాక్కున్నాడతను. తన తల్లితో తండ్రికి గొడవ జరిగిందని, అది పెద్దదై తుపాకీతో ఆమెను, ఆమె బంధువులను కాల్చేశాడని ఆ చిన్నారి చెప్పాడు. తమనూ చంపే ప్రయత్నం చేయడంతో అక్కడ దాక్కున్నామని చెప్పాడు. ఆ వెంటనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంటి వెనుక గుండా సమీపంలోని అడవిలోకి పారిపోయిన విజయ్‌ ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌ భార్య మీమూతో పాటు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ మృతి చెందారని, వాళ్లంతా ఆమె బంధువులని పోలీసులు నిర్ధారించుకున్నారు. విజయ్‌పై హత్య కేసు, పిల్లలపై క్రూరత్వం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అతని నుంచి విషయం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా భారతీయ కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురి చేసింది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ