పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు : ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితి వీక్షణ

الأربعاء، 7 يناير 2026

Andhra Pradesh CM Chandrababu Naidu inspects Polavaram project Views the project's current status through an aerial survey

t f B! P L


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వీక్షించారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ