దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై క్రిమినల్ కేసు నమోదు

السبت، 31 يناير 2026

A criminal case has been registered against director Teja's son Amitov Teja Andhra Pradesh cinema Jubilee Hills police have registered telangana

t f B! P L


దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2025లో క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయంలో ప్రణీత్ అనే వ్యక్తితో అమితోవ్ తేజకు పరిచయం ఏర్పడింది. తరవాత కొద్దికాలంలోనే ప్రణీత్, అతని భార్యతో కలిసి అమితోవ్ తేజ షేర్ మార్కెట్ లో ఒక అకౌంట్ తెరిచి ట్రేడింగ్ ప్రారంభించాడు. ముగ్గురు కలిసి ట్రేడింగ్ చేయగా రూ.11 లక్షలు నష్టం వాటిల్లిందని డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. దీంతో 2025 మే4న తనను అక్రమంగా నిర్బంధించి ఖాళీ పేపర్లు, చెక్కులు, ఆస్తిపత్రాలపై అమితోవ్ తేజ సంతకాలు పెట్టించుకున్నాడు అంటూ ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తేజ కుమారుడిపై బెదిరింపులు, డబ్బు వసూలు, కిడ్నాప్‌, అక్రమ నిర్బంధం, మహిళపై అసభ్య ప్రవర్తన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో తేజ సైతం ప్రణీత్, అతడి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో తనను దంపతులు ఇద్దరూ మోసం చేశారని, తన వద్ద పలు దఫాలుగా రూ.72 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ