మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చుట్టూ మరోసారి వివాదం ముసురుకుంది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉండి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ దర్యాప్తు పత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ పత్రాల్లో బిల్ గేట్స్‌పై అత్యంత వివాదాస్పదమైన, షాకింగ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ శుక్రవారం నాడు దాదాపు 30 లక్షల పేజీల పత్రాలు, 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలను బహిరంగపరిచారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో పారదర్శకత కోసం ఈ కీలక ఫైల్స్‌ను విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ పత్రాల్లో ప్రధానంగా బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని ఈమెయిల్స్ చర్చనీయాంశంగా మారాయి. విడుదలైన డాక్యుమెంట్లలో ఎప్స్టీన్ రాసిన కొన్ని ఈమెయిల్ డ్రాఫ్ట్‌లు వైరల్ అవుతున్నాయి. వీటిలో బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఆ పత్రాల ప్రకారం.. రష్యన్ అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల బిల్ గేట్స్‌కు ఒక లైంగిక వ్యాధి సోకిందని, దానిని ఆయన తన భార్య మెలిండా గేట్స్ నుంచి దాచాలని ప్రయత్నించారని జెఫ్రీ ఎప్‌స్టీన్ పేర్కొన్నాడు. తన వ్యాధి మెలిండాకు వ్యాపించకుండా ఉండేందుకు లేదా ఆమెకు చికిత్స చేయడానికి, ఆమెకు తెలియకుండానే యాంటీబయాటిక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయమని బిల్‌గేట్స్ కోరినట్లు ఎప్‌స్టీన్ రాశాడు. గేట్స్ తన 'వ్యాధి' పరిణామాలను ఎదుర్కోవడానికి మందులు పొందడంలో తాను సహాయం చేశానని, అలాగే బ్రిడ్జ్ టోర్నమెంట్ల కోసం ఆయనకు 'Adderall' వంటి మందులను సరఫరా చేయాలని తనను అడిగారని ఎప్‌స్టీన్ ఈమెయిల్స్‌లో ఆరోపించాడు. ఈ పత్రాలను చూస్తే ఎప్‌స్టీన్బిల్ గేట్స్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. 2017లో ఒక రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్ (మిలా ఆంటోనోవా)తో గేట్స్‌కు ఉన్న సంబంధాన్ని బయటపెడతానని ఎప్‌స్టీన్ బెదిరించినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. తన ఛారిటీ ఫండ్స్‌లో గేట్స్ పెట్టుబడి పెట్టలేదన్న కోపంతోనే ఎప్‌స్టీన్ ఈ పనులకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై బిల్ గేట్స్ ప్రతినిధి స్పందిస్తూ "ఇవన్నీ అసంబద్ధమైన, పూర్తిగా తప్పుడు ఆరోపణలు. ఎప్‌స్టీన్ తనతో సంబంధం కొనసాగించనందుకు కలిగిన అసహనంతో బిల్ గేట్స్ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్ర ఇది" అని స్పష్టం చేశారు. గేట్స్ ఇప్పటికే ఎప్‌స్టీన్‌తో గతంలో స్నేహం చేయడం తన జీవితంలో చేసిన 'పెద్ద తప్పు' అని అంగీకరించారు. బిల్ గేట్స్, మెలిండా 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లోనే మెలిండా మాట్లాడుతూ.. బిల్ గేట్స్‌కు ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయన సాన్నిహిత్యం తమ విడాకులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. తాజా ఫైల్స్ ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.
బిల్ గేట్స్‌కు ఒక లైంగిక వ్యాధి : ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ దర్యాప్తు పత్రాలలో వెల్లడి
السبت، 31 يناير 2026
Bill Gates had a sexually transmitted disease Microsoft founder Revealed in the investigation documents of Jeffrey Epstein technology who committed suicide
ليست هناك تعليقات:
إرسال تعليق