కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్.రవీశ్ నిశ్చితార్థానికి బయలుదేరాడు. అతనిపై దుండగులు కత్తితో దాడి చేయడంతో గాయపడ్డాడు. అనంతరం పెళ్లి కూడా రద్దు అయింది. ఇతనికి కొళ్లేగాల తాలూకా హొసఅణగళ్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్‌లో శుక్రవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కోసం తన గ్రామం నుంచి కారులో కుటుంబ సభ్యులతో కలసి రవీశ్ బయలుదేరాడు. కొళ్లేగాల ఎంజీఎస్‌వీ కాలేజీ రోడ్డు వద్ద దుండగులు వరుని కారును వెంబడించి కత్తితో దాడి చేశారు. రవీశ్ ఎడమ తొడకు గాయమై రక్తస్రావమైంది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం రవీశ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఒక యువకుడు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడని, తాను అదేమీ పట్టించుకోలేదన్నారు. ఇలా దాడిచేస్తారని అనుకోలేదన్నారు. భవిష్యత్తులో కూడా తనకు ప్రమాదం ఉండొచ్చని, అందుకే ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అతను యువతి మాజీ ప్రేమికుడని తనకు తెలిసిందన్నారు. ఈ విషయంపై యువతిని అడగ్గా గతంలో ప్రేమించిన మాట వాస్తవమేనని, ఇప్పుడు విడిపోయామని, తాను ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పిందని వివరించారు. కొళ్లేగాల పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ホーム
/
L. Raveesh
/
నిశ్చితార్థానికి బయలుదేరిన వరుడిపై కత్తితో దాడి
السبت، 31 يناير 2026
a resident of Kunagalli Chamarajanagar district crime Groom attacked with a knife while on his way to the engagement ceremony karnataka Kollegal taluk L. Raveesh
ليست هناك تعليقات:
إرسال تعليق