అమెరికా ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ సంకేతాలు !


మెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మిశ్రమ సంకేతాలను ఇస్తోంది. ఒకవైపు నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పడిపోయినా, కొత్తగా వస్తున్న ఉద్యోగాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా నిరుద్యోగిత రేటు తగ్గితే ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్లు భావిస్తారు. కానీ అమెరికాలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2025లో నెలవారీ ఉద్యోగాల వృద్ధి 2003 తర్వాత అతి తక్కువ స్థాయికి పడిపోయింది. 2024లో నెలకు సగటున 1.68 లక్షల ఉద్యోగాలు వస్తే, 2025లో అది కేవలం 49 వేలకు పరిమితమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన టారిఫ్  విధానాలు, ఇమ్మిగ్రేషన్ రూల్స్ వల్ల కంపెనీలు కొత్తవారిని తీసుకోవడానికి జంకుతున్నాయి. నిరుద్యోగిత తగ్గడానికి కారణం ఉద్యోగాలు పెరగడం కాదు, చాలామంది నిరుద్యోగులు ఉద్యోగ వేటను విరమించుకోవడం లేదా ఆటోమేషన్ పెరగడం వల్ల అని ఆర్థిక నిపుణులు  అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉత్పాదకత పెరిగినప్పటికీ, అది కొత్త ఉద్యోగాల వల్ల కాకుండా సాంకేతికత మరియు మెరుగైన పనితీరు వల్ల వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే భారత మార్కెట్‌కు అది రెండు రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది: అమెరికాలో ఆర్థిక వృద్ధి తగ్గితే చమురు డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు దిగివచ్చి భారత్ లాంటి దేశాలకు మేలు జరుగుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ సుంకాలు విధించే సాహసం చేయకపోవచ్చు. ఇది భారత ఎగుమతులకు కలిసొచ్చే అంశం. అమెరికా మార్కెట్లు డీలా పడితే, విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారత్ లాంటి వృద్ధి చెందుతున్న మార్కెట్ల వైపు చూసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments