తెలంగాణాలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వీరికి అవకాశం ఇవ్వడం ద్వారా వారి సమస్యలను మనం ప్రస్తావించడం కాకుండా వారి సమస్యలను వారే ప్రస్తావిస్తారని అలాగే ఈ సమాజంలో వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సోమవారం 'బాల భరోసా', 'ప్రణామ్' డే కేర్ సెంటర్లను ప్రజాభవన్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక విషయాలు ప్రస్తావించారు. ట్రాన్స్ జెండర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లితండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతంలో 10-15 శాతం కోత విధిస్తామన్నారు. కోత విధించిన డబ్బును తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తామన్నారు. ఈ విషయంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేస్తామన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేస్తే వారి జీతాల్లో కోత విధిస్తామన్నారు. తల్లిందండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని మనమే దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై ఏం బాధ్యత ఉంంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్కరికీ వైద్యం అందించాలనే ప్రణాళికలను ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకుంటోందని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం అని వర్గీకరణ కారణంగా కొందరిలో అసంతృప్తి ఉన్నా త్వరలో సర్దుకుంటాయన్నారు. వందేళ్ల తర్వాత తొలిసారి జనగణనతో పాటు కులగణన చేశామన్నారు. జనాభా దమాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని చూస్తోందన్నారు. ఈ ఏడాదిలో కేంద్రం చేస్తున్న జనగణన తెలంగాణ జనగణన మోడల్ ను కాపీ కొట్టిందన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. రెండేళ్ల మా పాలనలో అన్ని సమస్యలు పరిష్కరించామని, అద్భుతాలు చేశామని నేను చెప్పడం లేదు. కానీ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందన్నారు. ఒకప్పుడు ఈ ప్రజాభవన్ లోకి అడుగు పెట్టేందుకు నాలుగు గంటలు ఎదురు చూసినా గద్దర్ రాలేకపోయారు. కొద్ది మంది శ్రీమంతులు, బడా వ్యక్తులకే ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా ఇక్కడకు రావొచ్చు. ధర్మగంట కొట్టవచ్చు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకుంటోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం అన్నారు. ప్రజా సమస్యలను. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఈ ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చేస్తామన్నారు.
0 Comments