చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నంబర్ 2 పొజిషన్లో ఉన్న జనరల్ షాంగ్ యుక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. షాంగ్ యుక్సియాపై అవినీతి ఆరోపణలు ఒకెత్తు అయితే, చైనాకు చెందిన అత్యంత రహస్యమైన అణు ఆయుధాల డేటాను అమెరికాకు అమ్మేశారు అనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. షాంగ్ యుక్సియా అంటే జిన్ పింగ్ కు ప్రాణం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అలాంటి వ్యక్తిపై చైనా రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. చైనా దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? అనే ముఖ్యమైన టెక్నికల్ సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. మిలిటరీలో పదవుల కోసం భారీగా లంచాలు తీసుకోవడం, తన వాళ్లకు సీట్లు ఇచ్చుకోవడం లాంటివి చేశారట. ఇక సైన్యంలో జిన్ పింగ్ వ్యతిరేకంగా ఒక సొంత గ్రూపును తయారు చేస్తున్నారనే అనుమానం కూడా ఉంది. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక సైన్యంపై పట్టు పెంచుకోవడానికి చాలా మంది అధికారులను తీసేశారు. కానీ, ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిపై వేటు వేయడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు, ఈ విచారణకు ఏదో లింక్ ఉందని జనం అనుకుంటున్నారు.సరిహద్దుల్లో మనతో ఎప్పుడూ గొడవ పడే చైనా సైన్యంలో ఇలాంటి గందరగోళం రావడం గమనార్హం. అక్కడి నాయకత్వంలో గొడవలు జరిగితే అది వారి రక్షణ వ్యూహాలను దెబ్బతీస్తుంది. ఏదేమైనా, చైనా తన సొంత అణు రహస్యాలనే కాపాడుకోలేకపోయిందా? అనే చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తోంది.
చైనా అణు ఆయుధాల డేటాను అమెరికాకు అమ్మేసిన జనరల్ షాంగ్ యుక్సియా ?
الاثنين، 26 يناير 2026
Did General Zhang Youxia sell China's nuclear weapons data to the US? international Wall Street Journal Zhang Youxia is considered indispensable to Xi Jinping;
ليست هناك تعليقات:
إرسال تعليق