ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటుంది. భర్తతో విభేదించి దూరంగా ఉంటున్న మరియమ్మకు ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా మరియమ్మ పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పని చేసే వెంకట్రావుతో సహజీవనం చేసింది. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరూ మధ్య కూడా విబేధాలు రావడంతో వెంకట్రావుకు మరియమ్మ దూరంగా ఉంటుంది. వెంకట్రావును ఇంటికి రానీయకపోవడం, కనపడిన మాట్లాడకపోవడంతో మరియమ్మ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మరియమ్మకు బుద్ది చెప్పాలనుకుని తన స్నేహితుడైన రాజశేఖర్‌తో కలిసి మరియమ్మ ఇంటికి వచ్చాడు. మరియమ్మ ఒక్కతే ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో మరియమ్మ ముక్కు కోశాడు. ఆ ముక్కను తనతో తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మరియమ్మ ను స్థానికులు పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి నర్సరావుపేట ఆ తర్వాత గుంటూరు జిజిహెచ్ కు ఆమెను తీసుకెళ్లారు. ప్రస్తుతం జిజిహెచ్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ホーム
/
Piduguralla
/
ప్రియురాలి ముక్కు కోసిన ప్రియుడు !
الجمعة، 23 يناير 2026
Andhra Pradesh but due to some differences crime lived together harmoniously Lover cuts off girlfriend's nose Palnadu district Piduguralla
ليست هناك تعليقات:
إرسال تعليق