భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు బిజినెస్ వైపు అడుగులు వేయాలి !

الثلاثاء، 20 يناير 2026

Chandrababu Naidu in Zurich If both husband and wife are working meeting held with Andhras living abroad one should work and the other should take steps towards business

t f B! P L


దావోస్ సదస్సు కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూరిచ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌ తో భేటీ అయిన  ఏపీలో ఉన్న ఫార్మా, మెడికల్ ఎక్విప్‌మెంట్ రంగాల అవకాశాలను వివరించారు. ఏపీలో ఇప్పటికే 25 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టామని, ముఖ్యంగా ఏఐ, క్వాంటం టెక్నాలజీపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ఏకంగా 36 కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చలు, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్‌షిప్ ఇస్తామని బాబు ప్రకటించారు. రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్: కొత్త ఆలోచనలతో వచ్చే యువ స్టార్టప్‌ ల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 18 నెలల్లో ఏపీకి సుమారు రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. జూరిచ్‌లో ప్రవాస ఆంధ్రులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు "ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి" అనేదే తన ప్రభుత్వ విధానమని చెప్పారు. "భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఒకరు ఉద్యోగం చేస్తూ, మరొకరు బిజినెస్ వైపు అడుగులు వేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులను చూస్తుంటే తాను విజయవాడ లేదా తిరుపతిలో ఉన్నట్లు అనిపిస్తోందని బాబు వ్యాఖ్యానించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో డ్రోన్ రంగాన్ని భారీగా అభివృద్ధి చేస్తున్నామని, 100 కేజీల బరువును మోసుకెళ్లే డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. అలాగే 'ఈరోస్ ఇన్నోవేషన్స్' ఛైర్మన్ కిషోర్ లుల్లాతో భేటీ అయి, ఏపీలో ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, డిజిటల్ కంటెంట్ ఎకానమీపై చర్చించారు. విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్, గత దావోస్ పర్యటనల ద్వారా వచ్చిన రూ. 2 లక్షల కోట్ల హామీలను కార్యరూపంలోకి తెస్తూనే, కొత్త పెట్టుబడుల కోసం చంద్రబాబు గట్టిగానే శ్రమిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు అందరూ రావాలని కూడా చంద్రబాబు తన ప్రసంగంలో కోరారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ