దక్షిణ కొరియాపై ఆకస్మికంగా సుంకాలను పెంచిన డొనాల్డ్ ట్రంప్

الثلاثاء، 27 يناير 2026

15 percent to 25 percent Donald Trump abruptly increases tariffs on South Korea international Korea of ​​failing to implement a historic trade agreement signed last year

t f B! P L


క్షిణ కొరియా గతేడాది కుదుర్చుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతేడాది జూలైలో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికాలో దక్షిణ కొరియా సుమారు 350 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికన్ షిప్‌యార్డ్‌లను పునరుద్ధరించడం ఇందులో కీలక భాగం. అయితే ఈ ఒప్పందానికి దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ ఇంకా ఆమోదం తెలుపలేదు. 'దక్షిణ కొరియా శాసనసభ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదు. అమెరికా తన వంతుగా సుంకాలను తగ్గించినప్పటికీ భాగస్వామ్య దేశం నుంచి అదే స్పందన రావడం లేదు' అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈక్రమంలోనే అన్ని రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంపై దక్షిణ కొరియా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తమకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా పరిశ్రమల శాఖ మంత్రి కిమ్ జంగ్-క్వాన్, త్వరలోనే అమెరికాకు చేరుకుని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్‌తో చర్చలు జరపనున్నారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు కొరియా ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ట్రంప్ (Trump) అడ్మినిస్ట్రేషన్ కేవలం దక్షిణ కొరియానే కాకుండా యూరోపియన్ దేశాలు, కెనడా వంటి మిత్రదేశాలపై కూడా టారిఫ్ బెదిరింపులకు దిగుతోంది. గతంలో జార్జియాలోని హ్యుందాయ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేసిన ఘటనతో అమెరికా-కొరియా సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇప్పుడు తాజా సుంకాల విధింపుతో దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. మిత్ర దేశాలైనా, శత్రు దేశాలైనా అమెరికా ప్రయోజనాలే ముఖ్యమనే తన 'అమెరికా ఫస్ట్' విధానాన్ని ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ