ఛత్తీస్‌గఢ్‌లోని సియోని జిల్లాలోని ఒక గ్రామంలో మహిళ తన 20 రోజుల పసికందుతో కలిసి ఇంటి బయట కూర్చుని ఉండగా, ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో ఒక కోతి మహిళ ఒడిలో ఉన్న పసికందును బలవంతంగా లాక్కెళ్లింది. భయాందోళనకు గురైన తల్లి, గ్రామస్థులు కేకలు వేస్తూ కోతిని వెంబడించారు. దీంతో కంగారు పడ్డ ఆ కోతి, పక్కనే ఉన్న ఒక బావిలోకి చిన్నారిని విసిరింది. చిన్నారి బావిలో పడటంతో గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోతైన బావి కావడంతో అంతా కంగారు పడ్డారు. కానీ, అద్భుతమనేలా ఆ పసికందు నీటిలో మునగకుండా పైనే తేలుతూ కనిపించింది. వెంటనే చిన్నారిని బయటకు తీసి పరీక్షించగా క్షేమంగా ఉన్నట్లు తేలింది. దీనిపై స్థానిక నర్సు రాజేశ్వరి మాట్లాడుతూ "పాపకు వేసిన డైపర్ గాలితో నిండి ఉండటం వల్ల అది ఒక 'లైఫ్ జాకెట్'లా పనిచేసింది. దాని వల్లే పాప నీటిలో మునిగిపోకుండా తేలింది. డైపరే ఈ చిన్నారి ప్రాణాలను కాపాడింది" అని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
పసికందును బావిలో పడేసిన కోతి : లైఫ్ జాకెట్ లా కాపాడిన 'డైపర్' !
الجمعة، 23 يناير 2026
'Diaper' acts as a life jacket monkey snatched the baby from the woman's lap Monkey throws infant into a well Seoni district of Chhattisgarh
ليست هناك تعليقات:
إرسال تعليق