కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ కు అధికారం దక్కదు !

الجمعة، 23 يناير 2026

Andhra Pradesh Former MP Vijayasai Reddy Jagan will not gain power as long as he relies on his coterie politically active again

t f B! P L


ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు తేల్చి చెప్పారు. కూటమి కొనసాగితే జగన్ కు అధికారం సాధ్యం కాదన్నారు. అదే విధంగా కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ కు అధికారం దక్కదని చెప్పారు. అదే సమయం లో చంద్రబాబు ప్రభుత్వం ను టార్గెట్ చేసారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదంటూనే ఒక కీలక సంకేతం ఇచ్చారు. దురదృష్టం కొద్ది జగన్‌ కూడా కోటరీ మాటలు నమ్మారని 2020 నుంచి తనని సైడ్‌లైన్‌ చేశారని విజయసాయిరెడ్డి చప్పారు. మద్యం స్కామ్‌ అనేదాన్ని తాను నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో ఒక్క అపార్ట్‌మెంట్‌ తప్ప నాకేమీ లేదని, అలానే తనపై దుష్ప్రచారం చేసిన వారికి సరైన బుద్ధి చెబుతానన్నారు. తాను జగన్ కోసం పాలేరులా పని చేసానని విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన కొత్త రాజకీయ ప్రస్థానం పైన కొత్త సంకేతాలు ఇచ్చారు. తాను జగన్ ను విమర్శించలేదని, జగనే తన పైన ఆరోపణలు చేసారని గుర్తు చేసారు. తాను ప్రలోభాలకు లొంగానని జగన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అయితే సాయిరెడ్డి వైసీపీని వీడిన సమయంలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ తరువాత టీడీపీ నుంచి అభ్యంతరాల మేరకు ఆ ప్రతిపాదన నిలిచినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. కాగా తిరిగి పార్టీలోకి సాయిరెడ్డిని తీసుకొచ్చేందుకు వైసీపీలోనూ ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక.. సాయిరెడ్డి జనసేనలో చేరుతారని మరి కొందరు భావించారు. అయితే, ఏపీలో కూటమిలో సాయిరెడ్డికి ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీంతో.. బీజేపీ అధినాయకత్వంతో సాయి రెడ్డికి ఉన్న సత్సంబంధాలతో కమలం పార్టీకి దగ్గరయ్యే ఉందని తెలుస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ