తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జనవరి 17న సీఎం ఎంకే స్టాలిన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నారు. కాగా, పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద తాత్కాలికంగా టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఒక మహిళా పోలీస్ అధికారిణి ఆ టాయిలెట్‌లోకి వెళ్లగా అక్కడ ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. దీంతో ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళా పోలీస్ అధికారిణితో పాటు విధుల్లో ఉన్న సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఎస్‌ఐ)కు చెందిన మొబైల్ ఫోన్‌గా గుర్తించారు. మరోవైపు ఆ మొబైల్ ఫోన్‌లో ఎలాంటి వీడియో రికార్డ్ లేదని పోలీసులు తెలిపారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. పూర్తి దర్యాప్తు తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీ మండిపడ్డాయి. మహిళలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో శాంతి, భద్రతల అంశంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి.
ホーム
/
Tamil Nadu
/
టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌ను గమనించిన పోలీస్ అధికారిణి : మొబైల్ ఎస్‌ఎస్‌ఐదిగా గుర్తించి సస్పెండ్ చేసిన అధికారులు
الاثنين، 19 يناير 2026
Officials identify the phone as belonging to an SSI and suspend him Police officer notices mobile phone in toilet Ramanathapuram district Tamil Nadu
ليست هناك تعليقات:
إرسال تعليق