దేశీయ మార్కెట్లో ఆంపియర్ మాగ్నస్ జీ మాక్స్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో శక్తివంతమైన బ్యాటరీ, అధిక రేంజ్, స్మార్ట్ ఫీచర్లు , ఆధునిక డిజైన్ అందించారు. దీనిని ప్రత్యేకంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉండేలా ధర వినియోగదారులకు అందుబాటులో ఉండేలా తీసుకువచ్చారు. ఈ స్కూటర్‌లో డిజిటల్ డిస్ప్లే, సౌకర్యవంతమైన సీటింగ్,సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ 3 kWh లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తుంది. మాగ్నస్ జి మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫికెట్ ప్రకారం సుమారు 142km రేంజ్ అందిస్తుంది అని కంపెనీ చెబుతుంది. సాధరణంగా ఈ స్కూటర్ eco మోడ్ లో 100km పైన రేంజ్ ఇస్తుంది. మాగ్నస్ జీ మాక్స్ స్కూటర్ హబ్-మౌంటెడ్ మోటార్‌ తో వస్తుంది.ఇది 3.2 bhp పవర్ అందిస్తుంది.దీని టాప్ స్పీడ్ 65 kmph. 3.5-ఇంచ్ LCD డిజిటల్ డిస్ప్లే ఉంటుంది.USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.LED హెడ్ లాంప్ & ఇండికేటర్స్ ఉంటాయి.టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ ద్వారా కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి.డ్యూయల్ ఫ్రేమ్ చాసిస్ తో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంటుంది.33L అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనిలో  Eco, City, Reverse మోడ్స్.దీని బ్యాటరీ 20% నుండి 80% చార్జ్ కావడానికి 4.5 గంటల వరకు సమయం పడుతుంది.కంపెనీ 5 ఇయర్స్ లేదా 75,000 km బ్యాటరీ వారంటీని అందిస్తుంది. ఇది మాన్సూన్ బ్లూ, మాచా గ్రీన్, సినమన్ కాపర్ రంగులల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ లాంచ్ ఎక్స్ షో రూమ్ ధర Rs 94,999/-. ఇది సాధారణ రోజువారీ వినియోగానికి అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా లాంచ్ చేసారు. లేటెస్ట్ టెక్నాలజీ , స్పోర్టీ పెర్ఫార్మన్స్ పై మాత్రమే దృష్టి పెట్టకుండా రేంజ్, స్టోరేజ్, సౌకర్యం, మన్నిక వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది.


Post a Comment

أحدث أقدم