ఆంధ్రప్రదేశ్ లోని గుర్రంకొండలో పాఠశాల అప్ గ్రేడ్ కోసం మదనపల్లె డీఈవో కార్యాలయం ఏడీ రాజశేఖర్‌కు దరఖాస్తు చేశారు. అయితే ఆయన లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను పాఠశాల నిర్వాహకులు సంప్రదించారు. ఈ మేరకు డీఈవో కార్యాలయం ఏడీ రాజశేఖర్‌ను అదుపులో తీసుకున్నారు. రూ. 45 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వం ఆఫీసుల్లో ఎవరూ లంచం తీసుకోవద్దని, ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. 

Post a Comment

أحدث أقدم