తెలంగాణలోని షాద్ నగర్ పట్టణంలో గురువారం బీఎస్పీ పార్టీ నాయకులు స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం నుంచి సాయి రాజా ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలిలో కార్యకర్తలు టపాసులను కాల్చారు. టపాసులు కాల్చిన సమయంలో చెలరేగిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న విద్యుత్ టవర్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీ పై పడి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంతో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు, పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదంలో విద్యుత్ వైర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
బీఎస్పీ ఊరేగింపులో అపశృతి : విద్యుత్ టవర్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలపై టపాసులు పడి అగ్నిప్రమాదం
الخميس، 15 يناير 2026
An unfortunate incident occurred during a BSP procession Fire broke out after firecrackers landed on flex banners surrounding an electricity tower Shadnagar town telangana
ليست هناك تعليقات:
إرسال تعليق