చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ (36) అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం ఆమెకు 'విటిలిగో' అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి సోకింది. దీనివల్ల ఆమె జుట్టు తెల్లబడి, క్రమంగా ఊడిపోయి బట్టతల వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు అండగా నిలవాల్సిన భర్త, ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడం గానీ, ఆరోగ్యం గురించి అడగడం గానీ చేయలేదు. తన పరువు పోతుందని భావించి శుభకార్యాలకు కూడా ఆమెను దూరం పెట్టాడు. చికిత్సకు అయ్యే ఖర్చు భరించడం ఇష్టంలేక ఆమెను మానసికంగా వేధించడం ప్రారంభించాడు.భర్త నిర్లక్ష్యం, నిత్యం గొడవలతో లీ మానసికంగా కుంగిపోయింది. ఈ ఒత్తిడి కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమైందని వైద్యులు తెలిపారు. చివరికి ఆమె భర్త విడాకులు కోరగా, లీ అంగీకరించక తప్పలేదు. కోర్టు కూడా బిడ్డ కస్టడీని భర్తకే అప్పగించడంతో ఆమె ఒంటరైపోయింది. "అతనిలాంటి కఠిన హృదయుడిని నేనెక్కడా చూడలేదు" అని లీ కన్నీరుమున్నీరైంది.


Post a Comment

Previous Post Next Post