మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఆవిష్కరించింది. ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాల POLED డిస్ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 7400 మీడియాటెక్ dimencity చిప్ సెట్ తో పనిచేసే ఇందులో 12 జిబి రామ్, 256 నుంచి 512 GB స్టోరేజ్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి, గేమింగ్ కోసం ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి కావాల్సినంత స్పేస్ ఉండనుంది. 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావలసిన ఫోటోగ్రఫీ అందిస్తుంది. అలాగే 13 MP ఫ్రంట్ కెమెరా ఉండి సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. ఈ రెండు కెమెరాలతో 4k వీడియోను తీసుకుని చాన్స్ ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ కెమెరా అద్భుతమైన పరిచయీలను కనబరుస్తుంది. ఇందులో 5500 mAh బ్యాటరీ అమర్చారు.. ఇది 68 W సపోర్టుతో ఫాస్టెస్ట్ చార్జింగ్ కానుంది. అలాగే 7700 mAh బ్యాటరీ స్టోర్ వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 120 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో తొందరగా చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. బిజీగా ఉండేవారు.. రోజువారి అవసరాల కోసం మొబైల్ వాడేవారికి ఈ చార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది. ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయగా ఇందులో అట్మాస్ స్పీకర్స్ ను ఇన్స్టాల్ చేశారు. అలాగే డిస్ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇవ్వనుంది. ఈ మొబైల్ ను రూ.11,680 ధరతో విక్రయిస్తున్నారు. బడ్జెట్లో మొబైల్ కొనాలని అనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
0 Comments