మియాపూర్ నుండి విజయవాడ వెళుతున్న అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు చౌటుప్పల్ వద్దకు రాగానే గుండెపోటు వచ్చింది. ఆ నొప్పిని భరిస్తూ బస్సును పక్కకు ఆపారు. దీంతో హుటాహుటిన చికిత్స నిమిత్రం ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ డాక్టర్లు లేకపోవడంతో వెంటనే అక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడిని పరీక్షించిన డాక్టర్లు నాగరాజు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అయితే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. ఆయన అప్రమత్తతతో వారికి పెను ప్రమాదం తప్పింది.
అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు గుండెపోటుతో మృతి
الاثنين، 26 يناير 2026
Amaravati APSRTC driver Nagaraju dies of heart attack Andhra Pradesh suffered the heart attack when the bus reached Choutuppal telangana traveling from Miyapur to Vijayawada
ليست هناك تعليقات:
إرسال تعليق